by Suryaa Desk | Mon, Jan 06, 2025, 02:36 PM
అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ గురించి ఎంత చెప్పినా తక్కువే, అందం అభినయం ఈ అమ్మడు సొంతం. నేను శైలజ సీనిమాతో టాలీవుడ్ అభిమానుల మనసు దోచుకున్న ఈ చిన్నది, మహానటి సావిత్రి పాత్రలో ఒదిగిపోయి, టాలీవుడ్ ఈ తరం మహానటిగా మంచి పేరు సంపాదించుకుంది.ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం చిత్రల్లో నటిస్తూ చాలా బిజీ అయిపోయింది. అంతేకాకుండా 2024 డిసెంబర్‌లో తన చిన్ననాటి మిత్రుడు ఆంటోని థట్టిల్‌ను వివాహం చేసుకొని ఫ్యాన్స్‌ను సర్ ప్రైజ్ చేసిన విషయం తెలిసిందే.కీర్తీ, తన ప్రియుడు ఆంటోని 2016 నుంచి ప్రేమిస్తున్నాను, అప్పటి నుండే మేము ఇద్దరం ప్రేమలో ఉన్నాము, తర్వాత కుటుంబ సభ్యులకు మా విషయం చెప్పి, వారి అంగీకారంతో డిసెంబర్12న మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యామని తెలిపిన విషయం అందరికీ తెలిసిందే.అయితే ప్రస్తుతం కీర్తీ తన భర్త ఆంటోనితో కలిసి థాయిలాండ్‌లో హనీమూన్‌ను ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బ్యూటీ తన ఇన్ స్టాగ్రామ్‌లో తాను థాయిలాండ్‌లోని ఫుకెట్‌లో ఉన్న తన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు.ఇక కీర్తి సరేష్ ఇటీవల బాలీవుడ్‌లో హీరో వరుణ్ ధావన్‌తో కలిసి బేబీ జాన్ లో నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ డిసెంబర్‌లో విడుదలై అనుకున్న స్థాయిలో అభిమానుల మనసు దోచుకోలేక పోయింది.