by Suryaa Desk | Sat, Jan 04, 2025, 03:52 PM
రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరిలో శనివారం సాయంత్రం జరిగే ఈ ఈవెంట్‌కు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఈనేపథ్యంలో కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ పరిశీలించి కలెక్టర్ ప్రశాంతి, జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్‌తో మాట్లాడారు. అభిమానుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని దానికి అనుగుణంగా పోలీసు బందోబస్తు ఏర్పాట్లు పటిష్టం చేయాలని, వీఐపీ భద్రత, ట్రాఫిక్ రద్దీ వంటి వాటిపై ప్రత్యేక దృష్టిసారించాలని అధికారులకు సూచించారు. బాబాయ్ - అబ్బాయ్ ఒకే స్టేజ్‌పై సందడి చేయనున్నారని.. ఇది అభిమానులకు కన్నులపండుగ కానుందని ఆయన తెలిపారు.రామ్‌చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). కియారా అడ్వాణీ కథానాయిక. భారీ బడ్జెట్‌తో నిర్మాత దిల్‌రాజు ఈ మూవీని నిర్మించారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ఇది సిద్ధమైంది. అంజలి, ఎస్.జె. సూర్య, శ్రీకాంత్, సునీల్ కీలకపాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.
Latest News