by Suryaa Desk | Thu, Jan 02, 2025, 11:16 AM
ఆది సినిమాలో తొడగొట్టు చిన్న అనే డైలాగ్ తో పేరు తెచ్చుకున్న నటుడు ఫిష్ వెంకట్. తన కెరీర్లో ఇప్పటికే 100 కి పైగా సినిమాల్లో హాస్యనటుడిగా, విలన్ గా నటించారు. ఫిష్ వెంకట్ అనేక సినిమాల్లో తన కామెడీతో నవ్వులు పూయించారు. సినిమాల్లో బాగా ఎదిగిన ఫిష్ వెంకట్ ఇప్పుడు దయనీయ స్థితిలో ఉన్నాడు. ఒకప్పుడు చాలా మందికి దానం చేసిన ఫిష్ వెంకట్ ఇప్పుడు చాలా దుర్భర జీవితం గడుపుతున్నారు. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ ఫిష్ వెంకట్ ని ఇంటర్వ్యూ చేసింది. ఫిష్ వెంకట్ గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. అతని కుడి కాలు పూర్తిగా దెబ్బతింది. ప్రస్తుతం రాంనగర్ లోని తన ఇంట్లో ఫిష్ వెంకట్ దుర్భర జీవితాన్ని గడుపుతున్నాడు. ఫిష్ వెంకట్ తన బాధలను పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు.ఈ విషయం తెలుసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చలించిపోయారు. ప్రస్తుతం పవన్ ఈ రెండు రంగాల్లో కూడా బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే పవన్ నిజ జీవితంలో ఎంతోమంది సినీ నటులకు ఎన్నోమార్లు ఆర్ధిక సాయం చేసిన ఘటనలు చాలా ఉన్నాయి. అలాంటి పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా ఫిష్ వెంకట్ కి ఆర్ధిక సాయం అందించిన ఘటన బయటకి వచ్చింది.
Latest News