by Suryaa Desk | Tue, Dec 31, 2024, 12:56 PM
సమాజంలో జరుగుతున్న పరిణామాలపై తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి. తెలంగాణ మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన కల్పిస్తూ డ్రగ్స్ రహిత తెలంగాణ సాధన కోసం కృషి చేస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫేక్ న్యూస్.. అసత్య ప్రచారాలు.. డీప్ ఫేక్ వంటి అంశాలపై యుద్ధం ప్రకటించింది. ఈ అంశాలపై తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు సినీ తరాలతో అవగాహన కల్పిస్తోంది. ఈ క్రమంలోనే కిస్సిక్ పిల్ల శ్రీలీల అసత్య వార్తలపై వీడియో చేసింది. తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దని ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.తప్పుడు వార్తలు.. అసత్య కథనాలపై అవగాహన కల్పిస్తూ శ్రీలీల సోమవారం ఓ వీడియోను విడుదల చేశారు. 'సోషల్ మీడియాలో లైక్స్.. వ్యూస్.. రీచ్ కోసం తప్పుడు వార్తలు చేయకండి. సోషల్ మీడియాన మన మంచి కోసం వాడుదాం. వ్యూస్ కోసం ఇంకొకరిని న్యూస్ చేయకండి' అని శ్రీలీల విజ్ఞప్తి చేసింది. 'అసత్య ప్రచారాలకు దూరంగా ఉందాం. సామాజిక బాధ్యత వహిద్దాం' అంటూ శ్రీలీల పిలుపునిచ్చింది. అసత్య ప్రచారాలకు.. దూషణలకు స్వస్తి పలుకుదాం అని ఏపీ ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగా శ్రీలీలతోపాటు అడివి శేష్, నిఖిల్ సిద్ధార్థ్ అవగాహన కల్పిస్తూ వీడియోలు విడుదల చేశారు.
సోషల్ మీడియాను మన మంచి కోసం వాడుదాం అసత్య ప్రచారాలకు దూరంగా ఉందాం - శ్రీలీల@sreeleela14 #Sreeleela pic.twitter.com/SkdULhpYHo
— Leelu (@sreeleela_leelu) December 30, 2024