by Suryaa Desk | Tue, Dec 31, 2024, 05:52 AM
కిరణ్ అబ్బవరం నటించిన కొత్త సినిమా ‘దిల్ రూబా’. రుక్సర్ థిల్లాన్ హీరోయిన్. విశ్వకరుణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి రవి, జోజో జోస్, రాకేశ్ రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సినిమా టీజర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. జనవరి 3న టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ‘ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. లవ్, రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల్ని ఆకట్టుకోనుంది. ‘క’ సూపర్ హిట్ తరువాత కిరణ్ అబ్బవరం చేస్తున్న చిత్రంగా ‘దిల్ రూబా’పై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి’ అని చిత్రబృందం పేర్కొంది.
Latest News