by Suryaa Desk | Mon, Dec 30, 2024, 04:34 PM
మంచు విష్ణు టైటిల్ రోల్ నటిస్తోన్న సినిమా 'కన్నప్ప'. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నటి ప్రీత ముకుందన్ కథానాయికగా నటిస్తోంది. తాజాగా మేకర్స్ ఆమె లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ మూవీలో ఆమె ప్రీతి... రాకుమారి నెమలి పాత్ర పోషిస్తున్నట్లు వెల్లడించారు. ఇక మంచు మోహన్ బాబు నిర్మిస్తోన్న ఈ సినిమా 2025 ఏప్రిల్ 25న విడుదల కానుంది.హిస్టారికల్ కం మైథాలాజీ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ అగ్ర తారలు నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్‌కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి మంచు మోహన్ బాబు, మంచు విష్ణులతో పాటు పలువురు అగ్ర కథానాయకుల ఫస్ట్ లుక్‌లను పంచుకున్న చిత్రబృందం తాజాగా ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్న ప్రీతి ముకుందన్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఈ సినిమాలో ప్రీతి కన్నప్ప ఇష్టసఖి, చెంచుల యువరాణి నెమలి పాత్రలో నటిస్తుంది.
Latest News