by Suryaa Desk | Fri, Jan 03, 2025, 02:21 PM
తెలుగు సినీ ప్రేమికులకు చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె ఎన్నో భాషల సినిమాలకు సంబంధించిన పాటలను పాడి సింగర్ గా మంచి గుర్తింపును సంపాదించుకుంది.కేవలం సాంగ్స్ పాడి సింగర్ గా మంచి గుర్తింపును సంపాదించుకోవడం మాత్రమే కాకుండా ఈమె అనేక మంది నటులకు డబ్బింగ్ కూడా చెప్పి డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈమె సమాజంలో జరుగుతున్న పలు విషయాలపై తనదైన రీతిలో స్పందిస్తూ కూడాఅనేక సార్లు వార్తల్లో నిలిచింది.ఇకపోతే తాజాగా ఓ విషయంపై కూడా ఈమె తనదైన రీతిలో స్పందించింది. దానితో ఈమె మరో సారి వార్తల్లో నిలిచింది. అసలు విషయం లోకి వెళితే ... తాజాగా బ్లింకిట్ డెలివరీ యాప్ సీఈఓ డిసెంబర్ 31 వ తేదీన జరిగిన ఫుడ్ , పలు వస్తువుల డెలివరీల గురించి తన సోషల్ మీడియా అకౌంట్లో అకౌంట్‌లో రాసుకొచ్చాడు. అందులో భాగంగా ఈయన కేవలం ఆ ఒక్క రోజే 1,20,000 కాండోమ్స్ అమ్ముడుపోయినట్లు తెలియజేశాడు. దీనికి ఒక నెటిజన్ స్పందిస్తూ.. డిసెంబర్ 31 న రాత్రి ఒక లక్ష ఇరవై వేల కండోమ్ ప్యాకెట్లు డెలివరీ అయినట్లు బ్లింకిట్ సీ ఈవో పోస్ట్ చేశారు.
కేవలం ఒక్క రాత్రి అది కూడా బ్లింకిట్‌లో మాత్రమే ఆ స్థాయిలో జరిగితే ఇతర ఆప్ లలో కలుపుకుంటే ఆ విక్రయాలు కోటి వరకు ఉంటాయి అని స్పందించాడు. అలాగే ఈ తరంలో పెళ్లి చేసుకోవడానికి వర్జిన్ అమ్మాయి దొరకడం అదృష్టం అని కూడా పోస్ట్చే శాడు. ఈ పోస్ట్ కి చిన్మయి తనదైన రీతిలో స్పందించింది. చిన్మయి ఈ పోస్టుకు స్పందిస్తూ ఇలాంటప్పుడు మగవారు పెళ్లికి ముందు సెక్స్ అస్సలు చేయొద్దని తన సోషల్ మీడియా అకౌంట్లో రాసుకుంది. చిన్మయి సోషల్ మీడియా వేదికగా చేసిన ఈ కామెంట్ పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అలాగే చిన్మయి చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం ఫుల్ గా వైరల్ అవుతుంది.
Latest News