by Suryaa Desk | Tue, Dec 31, 2024, 12:51 PM
పుష్ప-2 ప్రభంజనం కొనసాగుతోంది. రిలీజైన మూడు వారాల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ.1700 కోట్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేయగా లాంగ్ రన్‌లో రూ. 1800 కోట్ల మార్క్ టచ్ చేసి బాహుబలి-2 రికార్డ్ బ్రేక్ చేసేలా ఉంది. ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్స్‌లో ఒక్క బాలీవుడ్ నుంచే దాదాపుగా సగం కలెక్ష్‌న్స్ రావడం విశేషం. దీంతో ఈ వీకెండ్ నాటికి పుష్ప -2 రూ.1800 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తుంది.అయితే ఇదే క్రేజ్ మరికొన్ని రోజులు ఉంటే ప్రభాస్ బాహుబలి 2 మీద ఉన్న అత్యధిక కలెక్షన్ల రికార్డును కూడా ఈ సినిమా చెరిపివేయనున్నట్లు తెలుస్తుంది. బాహుబలి 2 చిత్రం రూ.1800 కోట్ల వసూళ్లను సాధించి రెండో స్థానంలో ఉంది. దీనికంటే ముందు రూ.2300 కోట్లతో దంగల్ ఉంది. అయితే పుష్ప బాహుబలి 2 ని బీట్ చేయాలి అంటే పుష్ప 2 ఇంకో రూ.100 కోట్ల కలెక్షన్స్ రాబట్టాలి. ఇప్పటికే ఈ సినిమా ఆన్‌లైన్‌లో లీక్ అవ్వడంతో మూవీ కలెక్షన్లపై భారీ ఎఫెక్ట్ పడింది. దీంతో ఈ రికార్డును కొడుతుందా లేదా అనేది చూడాలి.
Latest News