by Suryaa Desk | Thu, Jan 02, 2025, 01:03 PM
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. భారీ అంచనాల మధ్య జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈరోజు ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లు సమాచారం.ఇక నిన్ననే ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేయాల్సి ఉంది. కానీ కొన్ని కారణాలవల్ల అది వాయిదా పడుతూ.. ఈరోజు విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా మరొకవైపు బాలకృష్ణ , బాబీ దర్శకత్వంలో చేస్తున్న సినిమా డాకు మహారాజ్ ,. ఈ సినిమా జనవరి 12వ తేదీన విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు చాలా గ్రాండ్గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించాలని అనుకున్నారు.కానీ గేమ్ ఛేంజర్ వల్ల అది వాయిదా పడింది. మరి గేమ్ ఛేంజర్ ట్రైలర్ ఈరోజైనా రిలీజ్ చేస్తారా? లేదా? అనే విషయం తెలియాల్సి ఉంది.ఇదిలా ఉండగా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. అందులో భాగంగానే సెన్సార్ నుండి ఈ సినిమా యూ/ఏ సర్టిఫికెట్ ను కూడా సొంతం చేసుకుంది.తాజాగా రన్ టైం కూడా లాక్ చేశారు సెన్సార్ బోర్డు అధికారులు. 2:45:30 నిడివి తో సినిమాని రన్ చేయబోతున్నారు. ఒకరకంగా చెప్పాలి అంటే ఇంత నిడివి ఉన్న సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా రెండున్నర గంటల పాటు థియేటర్లలో ప్రేక్షకులను కూర్చోబెట్టాలి అంటే, దర్శకుడు, హీరో ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అలాంటిది 2:45 గంటలు అంటే కచ్చితంగా ఎంతో శ్రమించారు అని అర్థమవుతుంది. మరోవైపు ఇప్పటికే ఈ సినిమాపై పాజిటివ్ మౌత్ టాక్ అక్కడక్కడ వినిపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతుందనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
ఇకపోతే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ రాంచరణ్ సరసన హీరోయిన్ గా ఎంపికైంది. అలాగే అంజలి కూడా ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జనవరి 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కి సిద్ధమవుతున్న ఈ సినిమా కోసం బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని సమాచారం. మరోవైపు గ్లోబల్ రేంజ్ ఇమేజ్ ఉన్న రామ్ చరణ్ తో శంకర్ రూపొందిస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందనే విషయం అందరిలోనూ చాలా ఎక్సైజ్ మెంట్ ను పెంచుతోంది.
Latest News