by Suryaa Desk | Fri, Jan 03, 2025, 08:53 PM
తమిళ నటుడు సముద్రఖని గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. విమానం, ఆర్‌ఆర్‌ఆర్, అల వైకుంఠ పురం, క్రాక్ లాంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యారు. అలాంటి సినిమాలో భాగం అవుతానని కలలో కూడా ఊహించలేదు. దీనికంటే ముఖ్యమైన మరో విషయం ఏమిటంటే.. నా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అప్ప’ (2016) విడుదలయ్యాక రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చింది. ‘నీ సినిమా చూశాను. మిమ్మల్ని ఒకసారి హత్తుకోవాలని ఉంది’ అని అన్నారు. అలాంటి చిత్రాన్ని రూపొందించడం అంత సులభం కాదని మెచ్చుకున్నారు. 2009లో ‘నాడోడిగల్’ విడుదలైనప్పుడు కూడా ఇలాంటి ప్రశంసలే రాజమౌళి నుంచి విన్నా. మొదటి ప్రయత్నంలోనే నేను ఈ స్థాయికి రాలేదు. గుర్తింపు వస్తుందా? లేదా? అనే విషయాన్ని పక్కనపెట్టి చేసే పనిలో 100శాతం నిజాయితీగా ఉంటే చాలు. ఏదో ఒక రోజు శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది’’ అని సముద్రఖని తెలిపారు.
Latest News