by Suryaa Desk | Fri, Jan 03, 2025, 08:51 PM
విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షీ చౌదరి కలిసి జంటగా నటిస్తోన్న మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ మూవీకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనాక్షీ వెంకటేష్‌తో నటించడం తన అదృష్ణమని, ఇది తన డ్రీమ్ రోల్ అని తెలిపింది. మొదటి సారి యాక్షన్ సీన్స్ చేశానని, ప్రేక్షకులకు ఎంతగానో నచ్చుతుందని పేర్కొంది. కాగా ఈ మూవీ జనవరి 14న థియేటర్లలో విడుదల కానుంది. కెరీర్ తొలినాళ్లలోనే ఆ ఛాన్స్ దక్కింది. పాత్ర కోసం రిఫెరెన్స్ ఏమీ తీసుకోలేదు. మా నాన్న ఆర్మీ ఆఫీసర్. వారి బాడీ లాంగ్వేజ్‌పై నాకు అవగాహన ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని కొంత హోమ్ వర్క్ చేశా. వెంకటేశ్ సర్ మంచి వ్యక్తి. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉంటారు. కామెడీ టైమింగ్ బాగుంటుంది. ఐశ్వర్య మంచి నటి. ఆమె నటించిన సినిమాలు చూశా. పాజిటివ్‌గా ఉంటారు. తన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా’’
Latest News