by Suryaa Desk | Fri, Jan 03, 2025, 03:39 PM
సావిత్రి బాయి పూలే 194వ జయంతి సందర్భంగా నేడు విజయవాడలో BCY పార్టీ ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటి రేణు దేశాయ్ పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. 'మహిళల విద్య కోసం సావిత్రబాయి పూలే ఎంతో కృషి చేశారు. నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను. సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం అని చెబితే వచ్చాను' అని ఆమె అన్నారు.
రేణూ దేశాయ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తన ఎన్జీవో పనుల గురించే మాత్రమే పోస్టులు వేస్తున్నారు. నెటిజన్లు చేసే నెగెటివ్ కామెంట్లకు ఎక్కువగా రియాక్ట్ అవ్వడం లేదు. గతంలో అయితే నెటిజన్లతో ఎక్కువగా వాదిస్తూ ఉండేవారు. ప్రతీ ఒక్కరికీ సమాధానాలు ఇస్తుండేవారు. కానీ రేణూ దేశాయ్ ఇప్పుడు అవన్నీ టైం వేస్ట్ పనులని అనుకుని ఉంటారు. తన పూర్తి సమయాన్ని పిల్లలు, పెట్స్ కోసమే కేటాయిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇక ఇప్పుడు ఆద్య పేరు మీద పెట్టిన ఎన్జీవో పనులతోనే బిజీగా ఉంటున్నారు. మరి బుల్లితెరపై గానీ, వెండితెరపై గానీ రేణూ దేశాయ్ ఎలాంటి ప్రాజెక్టులు చేస్తున్నట్టుగా కనిపించడం లేదు.