by Suryaa Desk | Wed, Jan 01, 2025, 02:36 PM
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కియారా అద్వానీ కథానాయిక. జనవరి 10న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది.ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ లకు మంచి స్పందన రాగా.. అవి సినిమా పై అంచనాలను పెంచాయి. ఇక ఈ చిత్ర ట్రైలర్ ఎప్పుడు విడుదల అవుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. కొత్త సంవత్సరం సందర్భంగా చిత్ర బృందం సాలీడ్ అప్‌డేట్ ఇచ్చింది.ఈ చిత్ర ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించింది. జనవరి 2న సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఆట మొదలైంది అంటూ చరణ్ పంచె కట్టుతో ఉన్న ఫోటోను పంచుకుంది.ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ బాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తుండగా ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, అంజలి, సునీల్, ప్రకాశ్‌రాజ్, జయరామ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
Latest News