by Suryaa Desk | Tue, Dec 31, 2024, 05:51 AM
సల్మాన్‌ఖాన్ కథానాయకుడిగా తమిళ దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్ తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘సికందర్’. రష్మిక మందన్న కథానాయిక. సాజిద్ నడియడ్‌వాలా నిర్మిస్తున్నారు. తాజాగా, ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో సల్మాన్ లుక్, సంభాషణలు, యాక్షన్ హంగామాతో పాటు విజువల్స్ ఆకట్టుకున్నాయి. ఈ టీజర్ చూసిన అభిమానులు.. ఈ సారి సల్మాన్‌కు హిట్ పక్కా అని ఆనందపడుతున్నారు. వచ్చే ఏడాది రంజాన్ కానుకగా చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. అయితే, ఈ టీజర్ సల్మాన్ పుట్టినరోజున విడుదల కావాల్సి ఉండగా.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలుపుతూ ఒక రోజు వాయిదా వేశారు. కాగా, ఇటీవలే విడుదలైన ‘బేబీ జాన్’, ‘సింగమ్ అగైన్’ చిత్రాల్లో అతిథి పాత్రల్లో కనిపించిన సల్మాన్ అభిమానులను అలరించారు.
Latest News