by Suryaa Desk | Mon, Dec 30, 2024, 04:34 PM
ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవి తన తండ్రి వెంకట్రావు వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించారు. తల్లి అంజనా దేవి, భార్య సురేఖ, సోదరుడు నాగేంద్రబాబు దంపతులతో కలిసి చిరు ఇవాళ పూజలు నిర్వహించారు. ఈ మేరకు ట్విట్టర్ ‘ఎక్స్’ వేదికగా ఫొటోలు, వీడియోను పంచుకున్నారు. ‘జన్మనిచ్చిన ఆ మహనీయుడ్ని ఆయన స్వర్గస్తులైన ఈ రోజున స్మరించుకుంటూ..’ అని చిరు ట్వీట్ చేశారు.ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన 'బింబిసారా' ఫేం వశిష్ఠ దర్శకత్వంలో 'విశ్వంభర' మూవీ చేస్తున్నారు. ఆ తర్వాత మరో యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలాతో సినిమా చేయనున్నారు. ఇటీవలే అధికారికంగా ఈ ప్రాజెక్టుపై ప్రకటన కూడా వచ్చింది. నేచురల్ స్టార్ నాని ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇలా యువ హీరోలకు పోటీగా చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.
Latest News