by Suryaa Desk | Wed, Jan 01, 2025, 02:59 PM
టాలీవుడ్ యంగ్ హీరో నాని హిట్-3 సినిమా షూటింగ్‌లో విషాదం నెలకొంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో భాగంగా.. శ్రీ నగర్(Sri Nagar) వెళ్లారు. అక్కడ కొద్ది రోజులుగా కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో ఓ సిన్ షూటింగ్ చేస్తుండగా.. అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్(Assistant cinematographer) గా పని చేస్తున్న KR క్రిష్ణ(KR Krishna) అనే మహిళ(Woman)కు హార్ట్ ఎటాక్(Heart attack) వచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన సినిమా సిబ్బంది. హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే KR క్రిష్ణ చికిత్స పొందుతూ మృతి(Died) చెందింది. దీంతో చిత్ర యూనిట్‌లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె మరణంతో వారం రోజుల షెడ్యూల్ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయినట్లు తెలుస్తుంది. శ్రీ నగర్ మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండటంతోనే ఇలా జరిగి ఉండవచ్చని చిత్ర యూనిట్ భావిస్తున్నారు. కాగా ఈ సినిమాకు ముందు ఇప్పటికే రెండు పార్టులు రాగా అవి భారీ విజయాన్ని అందుకున్నాయి. ఈ హిట్-3 సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు.
Latest News