by Suryaa Desk | Thu, Jan 02, 2025, 02:19 PM
మహానటి కీర్తి సురేష్ ఎప్పుడైతే పెళ్లి పీటలెక్కిందో ఇక అప్పటినుంచి ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. పైగా ఎప్పుడైతే ఆంటోని తట్టిల్ తో పెళ్లి జరగబోతున్నట్టు అనౌన్స్ చేసిందో అప్పటి నుండి కీర్తి సురేష్ కి సంబంధించిన ఎన్నో తెలియని విషయాలు మీడియాలో ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ తన ప్రేమ కథ మొత్తాన్ని బయట పెట్టింది. మరి ఇంతకీ కీర్తి సురేష్ ప్రేమ ఎప్పుడు మొదలైంది..? వీరి 15 ఏళ్ల ప్రేమ బంధం ఎలా కొనసాగింది..? ఇద్దరిలో ఎవరు ముందుగా ప్రపోజ్ చేశారు..? ప్రేమ ప్రపోజల్ జరిగిన తర్వాత ఒకరికొకరు మొదటిసారి ఇచ్చుకున్న గిఫ్ట్ ఏంటి? ఇలా ఎన్నో అంశాలపై స్పందించింది కీర్తి సురేష్.కీర్తి సురేష్ , ఆంటోనీ తట్టిల్ ల పెళ్లి గత ఏడాది డిసెంబర్ 11న హిందూ సాంప్రదాయం ప్రకారం గోవాలో గ్రాండ్ గా జరిగింది. ఆ తర్వాత క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం మళ్లీ వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అలా రెండు సాంప్రదాయాల్లో పెళ్లి చేసుకుంది ఈ జంట. అయితే పెళ్లి జరిగిన రెండు మూడు రోజులకే తన బాలీవుడ్ మూవీ బేబీ జాన్ కోసం ప్రమోషన్స్ లో పాల్గొంది. అలా ప్రమోషన్స్ చేసిన సమయంలో.. కీర్తి సురేష్ తన మెడలో పసుపు తాడుతో ప్రమోషన్స్ కి రావడంతో చాలామంది ఆశ్చర్యపోయారు.
అంతేకాదు హీరోయిన్లందరూ కీర్తి సురేష్ ని చూసి నేర్చుకోవాలని, సినిమా కోసం తాళి, మెట్టెలు తీసేసి కనిపించే ఎంతోమంది హీరోయిన్లు కీర్తి సురేష్ ని చూసి నేర్చుకోవాలని పొగిడారు. అయితే తాజాగా కీర్తి సురేష్ తన ప్రేమ గురించి మాట్లాడుతూ..”మేము 12వ తరగతిలో ఉన్నప్పుడే ప్రేమలో పడ్డాం.. ఆంటోని నాకంటే ఏడు సంవత్సరాలు వయసులో పెద్దవాడు. ఇక మా ఇద్దరి ప్రేమలో మొదట ప్రపోజ్ చేసింది ఆంటోనీనే. మా ఇద్దరి మధ్య అలా సరదాగా పరిచయం సాగుతున్న సమయంలో ఓ రోజు నేను మా ఫ్యామిలీని తీసుకొని రెస్టారెంట్ కి వెళ్లాను.అక్కడికి అనుకోకుండా ఆంటోని తట్టిల్ కూడా వచ్చారు. ఇక అక్కడ మా ఫ్యామిలీ ఉండడంతో మాట్లాడటం కుదరలేదు. దాంతో ఆయన ఒక సైగ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు.ఆ తర్వాత మీకు ధైర్యం ఉంటే నాకు ప్రపోజ్ చేయండి అంటూ చెప్పాను. దాంతో ఆంటోనీ చాలా ధైర్యంగా నాకు 2010లో ప్రపోజ్ చేశాడు.దాంతో మా బంధం బలపడింది. ఇక 2016 నుండి మా ఇద్దరి మధ్య మరింత స్ట్రాంగ్ గా బంధం ఏర్పడింది. ఆ తర్వాత కొద్దిరోజులు మేము సన్నిహితంగా కలిసిమెలిసి తిరిగాము.
ఇన్ని సంవత్సరాల ప్రేమలో ఒకరి గురించి ఒకరం తెలుసుకోగలిగాం. 2017లో మేమిద్దరం కలిసి ఫస్ట్ టైం ట్రిప్ కి వెళ్ళాం. ఇక ఆంటోనీ నన్ను ప్రేమించాక నాకు ఇచ్చిన మొదటి గిఫ్ట్ ప్రామిసింగ్ రింగ్..ఆ రింగ్ ని నేను పెళ్లయ్యే వరకు కూడా నా చేతి వేలి నుండి తీయలేదు. నేను నటించిన ప్రతి సినిమాలో ఆ రింగ్ ని మీరు గమనించవచ్చు. అలాగే గత రెండేళ్ల క్రితమే మేమిద్దరం కలిసి సోలోగా ట్రిప్ కి వెళ్ళాము. అప్పటి నుండే డేటింగ్ చేయడం మొదలుపెట్టాం. ఇక 2022లో మేము మొదటిసారి పెళ్లి ఆలోచనలో పడ్డాం. ఆ తర్వాత అన్నీ ఆలోచించి ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి ఎట్టకేలకు 2024 డిసెంబర్లో మా పెళ్లి జరిగింది. ఆంటోని తట్టిల్ కి చాలా మొహమాటం..ఆయన ఒకరి చేయి ఒకరు పట్టుకొని తిరగాలంటే కూడా మొహమాట పడతారు. ఇక నేను ఆంటోనితో ప్రేమలో ఉన్న విషయం ఇండస్ట్రీలో ఉన్న అతికొద్ది మందికి మాత్రమే తెలుసు.. నా ప్రేమ విషయం సమంత, ప్రియదర్శన్ , అట్లీ, ప్రియ, విజయ్, ఐశ్వర్య లక్ష్మి వంటి వారికి మాత్రమే తెలుసు. నేను నా పర్సనల్ విషయాన్ని చాలా రహస్యంగా ఉంచాను. అందుకే ఇన్ని రోజులు ఈ విషయం బయటపడకుండా రహస్యంగా మెయింటైన్ చేయగలిగాను. ఇక నేను మెడలో పసుపు తాడు వేసుకోవడం చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. కానీ నేను తాళికి చాలా గౌరవం ఇస్తాను. ఇది చాలా పవర్ఫుల్.. అలాగే పవిత్రమైనది.. అందుకే నేను నా మెడ నుండి తీయడం లేదు. ఒక మంచి ముహూర్తం చూసుకొని, నేను నా తాడుని బంగారు గొలుసుకి లోకి మార్చుకుంటాను.ఇప్పటికి కూడా నేను పెళ్లి చేసుకున్నాను అంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు. ఒక కలలా ఉంది.. నా హృదయం భావోద్వేగంతో నిండిపోయింది.మేము ఎన్నో రోజులు ఈ పెళ్లి కోసం కలలు కన్నాం” అంటూ కీర్తి సురేష్ తన ప్రేమ విషయాన్ని అభిమానులతో పంచుకుంది.
Latest News