by Suryaa Desk | Tue, Dec 31, 2024, 03:51 PM
మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. ఫైనల్‌గా మరో పది రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర అసలు సిసలైన గేమ్ స్టార్ట్ కాబోతోంది. జనవరి 10న గేమ్ ఛేంజర్ రిలీజ్ కానుండగా ఇప్పటికే ప్రమోషన్స్ స్సీడప్ చేశారు మేకర్స్. జనవరి 1, 2 తేదీల్లో ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఉండనుంది. ఆ తర్వాత ఏపిలోని రాజమండ్రిలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ జనవరి 4న లేదా 5న రాజమండ్రిలో గేమ్ ఛేంజర్ ఈవెంట్ ఉంటుందని సమాచారం. ఇక రిలీజ్ టైం దగ్గర పడడంతో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది గేమ్ ఛేంజర్.సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసినట్లు సమాచారం. రన్ టైం వచ్చేసి దిల్ రాజు చెప్పినట్టుగా 2 గంటల 45 నిమిషాలుగా లాక్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక సెన్సార్ టాక్ అదిరిపోయినట్టుగా సినీ సర్కిల్స్ లో చెబుతున్నారు. ఫస్ట్ హాఫ్ బావుందని. ఇంటర్వెల్ బ్యాంగ్ ఓ రేంజ్ హై ఇస్తుందని, ముఖ్యంగా ఓ 20 నిమిషాలు పాటు ఉండే ట్రైన్ ఎపిసోడ్ మామూలుగా లేదని తెలిసింది. ఇక ఇంటర్వెల్ తర్వాత అసలైన గేమ్ స్టార్ట్ అయి సెకండాఫ్‌ని శంకర్ పరుగులు పెట్టించాడని అంటున్నారు. ఇక రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ మామూలుగా లేదట. మొత్తంగా గేమ్ ఛేంజర్ సెన్సార్ టాక్ మాత్రం బ్లాక్ బస్టర్ అన్నట్టుగా ఉంది. శంకర్ ఈ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ అయినట్టేనని అంటున్నారు. ఆల్రేడీ సుకుమార్, మెగాస్టార్ చిరంజీవి గేమ్ ఛేంజర్ చూశారట. వాళ్లు ఇచ్చిన రివ్యూస్ సినిమా పై అంచనాలను మరింతగా పెంచేశాయి. ఈ సంక్రాంతికి గట్టిగా కొడుతున్నామని మెగాస్టార్ చెప్పేశారు. ఇప్పుడు సెన్సార్ టాక్ కూడా అదిరిపోవడంతో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
Latest News