by Suryaa Desk | Tue, Dec 31, 2024, 03:42 PM
ఈ ఏడాదికి ‘అమరన్’ బెస్ట్ చిత్రమని నటి జాన్వీ కపూర్ పేర్కొన్నారు. తాజాగా ఈ సినిమా చూసిన జాన్వీ రివ్యూ ఇచ్చారు. ‘‘ఈ సినిమా చూడటం కొంచెం ఆలస్యమైంది. ఈ చిత్రంలో ప్రతీ సన్నివేశం భావోద్వేగంతో నిండి ఉంది. ఒక మంచి సినిమాతో ఈ ఏడాదిని ముగించాను. ‘అమరన్’ నా హృదయాన్ని కదిలించింది. ఇందులోని ఎమోషన్స్ నా హృదయాన్ని బరువెక్కించాయి’’ అని రాసుకొచ్చారు.అక్టోబర్ 31న పలు భాషల్లో ‘అమరన్’ ప్రేక్షకుల ముందుకువచ్చింది. ‘ఇండియాస్ మోస్ట్’ అనే పుస్తకంలోని మేజర్ వరదరాజన్ కథ ఆధారంగా ఇది రూపొందింది. వరదరాజన్‌గా శివ కార్తికేయన్ నటించగా, భార్య ఇందు రెబెకా జాన్ వర్ఘీస్ పాత్రలో సాయిపల్లవి నటించారు. తమిళంలో సోనీ పిక్చర్స్‌తో కలిసి కమల్‌హాసన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ముకుంద్, ఇందు మధ్య సన్నివేశాలు హృద్యంగా తెరకెక్కించారు. వ్యక్తిగత జీవితమే కాకుండా, మరోవైపు వృత్తి జీవితాన్నీ అంతే సహజంగా తెరపై ఆవిష్కరించారు. హృద్యమైన ఓ ప్రేమకథతో పాటు, దేశభక్తిని రగిలించే సైనికుడి స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్ని పరిపూర్ణంగా ఆవిష్కరించిన ఈ సినిమాపై సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రసారమవుతోంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఇది అందుబాటులో ఉంది.
Latest News