by Suryaa Desk | Fri, Jan 03, 2025, 03:07 PM
చిరంజీవితో శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. రెగ్యులర్ గా అయితే ఇది ఓ సీనియర్ స్టార్ హీరో – యంగ్ డైరెక్టర్ సినిమా గా పిలిచేవారు. అయితే శ్రీకాంత్ ఓదెల కు ఉన్న క్రేజ్ తో ఈ సినిమా నెక్ట్స్ లెవిల్ కు వెళ్లింది. దానికి తోడు ఆయన చిరంజీవికి ఫ్యాన్ కావడంతో ఈ సినిమా పై ఎక్సపెక్టేషన్స్ పెరిగిపోయాయి. అందులోనూ ఈ సినిమాలో చిరంజీవి గ్యాంగస్టర్ గా రెట్రో స్టైల్ లో కనిపించబోతున్నారు. ఇవన్నీ చూస్తూంటే పవన్ కల్యాణ్ , సుజీత్ ‘ఓజీ’ సినిమాకు వచ్చిన క్రేజ్ దీనికీ వస్తోందని ట్రేడ్ అంటోంది. అంతాబాగానే ఉంది చిరంజీవి ఈ ప్రాజెక్టు నిమిత్తం ఎంత తీసుకోబోతున్నారు అనేది హాట్ టాపక్ గా మారింది. మెగాస్టార్ గా చిరంజీవి రెమ్యునరేషన్ ఎప్పుడూ పై స్దాయిలోనే ఉంది. ఈ ఏజ్ లోనూ యంగ్ హీరోలకు థీటుగా ‘ఖైదీ నెంబర్ 150’, ‘వాల్తేరు వీరయ్య’వంటి సూపర్ హిట్స్ ఇవ్వటంతో ఆయనకు మంచి రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. తాజాగా వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ‘విశ్వంభర’ చిత్రానికి రూ.60 కోట్ల పారితోషికం అందుకొన్నట్టు తెలుస్తోంది.
ఇక శ్రీకాంత్ ఓదెల చిత్రానికి ఇప్పుడు ఆయన పారితోషికం రూ.75 కోట్లకు చేరుకొందని వినికిడి. సుధాకర్ చెరుకూరి ఈ చిత్రానికి నిర్మాత. అయితే ఇక్కడ చిన్న మెలిక ఏమిటంటే... విశ్వంభర – శ్రీకాంత్ ఓదెల సినిమాల మధ్య చిరు మరో సినిమా చేస్తారు. దీనికి అనిల్ రావిపూడి దర్శకుడు. ఈ సినిమాకు రెమ్యనరేషన్ ఎంతన్నది తేలాలి.శ్రీకాంత్ ఓదెల చిత్రం విషయానికి వస్తే... స్టార్ హీరో నాని ఈ చిత్రాన్ని సమర్పిస్తూ, సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఎగ్రిమెంట్స్ అన్ని పూర్తయ్యాయి. ప్రొడక్షన్ టీమ్ చిరంజీవి రెమ్యునరేషన్, రూల్స్ ని ఓకే చేసింది. ₹75 కోట్లు చెల్లించడానికి ఓకే చెప్పి అడ్వాన్స్ పే చేసింది. అఫీషియల్ గా ప్రాజెక్ట్‌ను లాక్ చేసి ప్రకటించడం జరిగింది.ప్రస్తుతం, శ్రీకాంత్ ఒదెల నానితో ది ప్యారడైజ్‌కి దర్శకత్వం వహిస్తున్నాడు, అయితే నాని ...శైలేష్ కొలను దర్శకత్వంలో HIT 3 చిత్రీకరణలో బిజీగా ఉన్నందున షూటింగ్ వాయిదా పడింది. శ్రీకాంత్ ది ప్యారడైజ్‌ను పూర్తి చేసిన తర్వాతే చిరంజీవి ప్రాజెక్ట్ ప్రారంభమవుతుంది.
Latest News