by Suryaa Desk | Fri, Jan 03, 2025, 03:09 PM
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డ్రగ్స్ రహిత సమాజం కోసం సినీ సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. తమవంతుగా ప్రచారం చేస్తూ.. యూత్ ను ఆలోచింపజేస్తున్నారు.ఇప్పటికే మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమంలో భాగంగా ప్రభాస్, చిరంజీవి, అడవి శేష్ వంటి హీరోలు పలు కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఎన్టీఆర్ కూడా డ్రగ్స్ రహిత సమాజం కొరకు యూత్ నాతో చేతులు కలపాలని కీలక వ్యాఖ్యలు చేశారు.” మన దేశ భవిష్యత్ మన చేతుల్లోనే ఉంది. కానీ కొంత మంది అవన్ని పట్టించుకోకుండా తాత్కాలిక ఆనందాల కోసం, క్షణికమైన ఒత్తిడి నుంచి బయటపడటం కోసం మాదర ద్రవ్యాల బారిన పడుతున్నారు. ఇది సహచరుల ప్రభావం వల్లనో, స్టైయిల్ అనో డ్రగ్స్ కి ఆకర్షితులు కావడం చాలా బాధాకరం. జీవితం అన్నింటికంటే చాలా విలువైనది. రండి నాతో చేతులు కలపండి. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వం సంకల్పంలో భాగస్వాములు అవ్వండి. మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ అమ్మడం కొనడం వంటివి చేస్తే వెంటనే తెలంగాణ నార్కొటిక్స్ బ్యూరో ఫోన్ నెంబర్ 8712671111 కు సమాచారం ఇవ్వండి. అందరూ జాగ్రత్తగా ఉండండి” అంటూ చెప్పుకొచ్చారు ఎన్టీఆర్. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది
Latest News