by Suryaa Desk | Wed, Jan 01, 2025, 12:19 PM
ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా యువ దర్శకుడు మహేష్ బాబు ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. రామ్‌కు ఇది 22వ చిత్రం. ఈ చిత్రానికి నవీన్ ఎర్నేని, రవి శంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే న్యూ ఇయర్ సందర్భంగా మూవీ మేకర్స్ హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇటీవల పూర్తయింది.హీరోయిన్ భాగ్య శ్రీ ట్రెడిషనల్ లుక్కులో కాలేజీ స్టూడెంట్ రోల్ చేస్తున్నారని అర్థం అవుతోంది. రామ్ క్యూట్ లో దర్శనమిచ్చాడు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇటీవల పూర్తయింది. ”హైదరాబాద్‌లో మొదలైన ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ఇటీవల పూర్తి అయ్యింది. రామ్, ఇంకా ఇతర ప్రధాన తారాగణం మీద కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. సాగర్ పాత్రలో రామ్ ఒదిగిన తీరు, నటన ఆడియన్స్ అందరికీ ఒక ట్రీట్ లా ఉంటుందట. ప్రేక్షకులు నోస్టాల్జియాలోకి వెళతారని, ఆ పాత్రలో తమను తాము చూసుకుంటారని తెలుస్తోంది. హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే లుక్ సైతం అందర్నీ ఆకట్టుకుంటోంది. రామ్, భాగ్య శ్రీ జోడీ మధ్య వచ్చే సీన్లు హైలైట్ అవుతాయని యూనిట్ టాక్. కాగా ఈ సినిమాకు వివేక్ – మెర్విన్ లు సంగీతం అందిస్తున్నారు.