by Suryaa Desk | Tue, Dec 31, 2024, 05:55 AM
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నుంచి ప్రతీ సోమవారం ఒక అప్డేట్ వస్తుందని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. మధ్యలో ఒకటి రెండు సోమవారాలు మిస్సయినా.. చెప్పినట్టుగానే ఈ భారీ ప్రాజెక్టు నుంచి ప్రతీ సోమవారం ఏదో ఒక కీలక అప్డేట్‌ను విడదలు చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే సినిమాలోని విభిన్న పాత్రలను పోషించిన దిగ్గజ నటీనటుల పోస్టర్‌లను విడుదల చేసి సినిమాపై క్యూరియాసిటీ పెంచిన టీమ్.. ఇప్పుడు హీరోయిన్ లుక్‌ని రివీల్ చేశారు.ఇప్పటికే ఈ సినిమా నుండి మోహన్ బాబు, మోహన్ లాల్, మధుబాల, శరత్ కుమార్, దేవరాజ్ వంటి దిగ్గజ నటులు పోషించిన పాత్రల పోస్టర్స్ రిలీజ్ చేసిన టీమ్ ఇప్పుడు చిత్ర హీరోయిన్‌కి సంబంధించిన బ్యూటిఫుల్ పోస్టర్‌ని వదిలింది.
ఈ సినిమాలో హీరోయిన్ ప్రీతి ముఖుంధన్ రోల్ ఎలా ఉండబోతుందో తెలుపుతూ తాజాగా ఓ కత్తిలాంటి పోస్టర్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ప్రకారం ‘కన్నప్ప’లో ప్రీతి ముఖుందన్ నెమలిగా కనిపించబోతుంది.‘‘అందంలో సహజం, తెగింపులో సాహసం, ప్రేమలో అసాధారణం, భక్తిలో పారవశ్యం, కన్నప్పకు సర్వస్వం, చెంచు యువరాణి నెమలి’’ అంటూ తాజాగా వదిలిన ఈ పోస్టర్ పై రాసిన పదాలు ఈ క్యారెక్టర్ పట్ల క్యూరియాసిటీని పెంచుతున్నాయి. ఈ పోస్టర్ విడుదలైన కొన్ని నిమిషాల్లోనే వైరల్‌గా మారింది. ‘కన్నప్ప’ చిత్రంలో డా.మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్, శరత్ కుమార్, బ్రహ్మానందం, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వంటి భారీ తారాగణం నటిస్తుంది. విష్ణు మంచు టైటిల్ రోల్‌లో నటిస్తున్న ఈ చిత్రాన్ని మోహన్ బాబు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా.. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నారు. ‘కన్నప్ప’ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే విజువల్ వండర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాను 25 ఏప్రిల్, 2025న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
Latest News