by Suryaa Desk | Thu, Jan 02, 2025, 03:59 PM
జబర్దస్త్ అత్యంత పాప్యులర్ కామెడీ షో. ఈ షో వేదికగా చాలా మంది సామాన్యులు స్టార్స్ అయ్యారు. ముఖ్యంగా అనసూయ, రష్మీ గౌతమ్ ల ఫేట్ మార్చేసిన షో ఇది. ఏళ్ల తరబడి వీరిద్దరూ జబర్దస్త్ షోలో తమ గ్లామర్ తో ఎంటర్టైన్ చేశారు. కాగా 2022లో అనసూయ జబర్దస్త్ నుండి తప్పుకుంది. అనసూయ మానేయడంతో కొన్నాళ్ళు రష్మీ జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలకు యాంకర్ గా వ్యవహరించింది. కొన్ని ఎపిసోడ్స్ అనంతరం కన్నడ అమ్మాయి సౌమ్యరావును తెచ్చారు. ఏడాదికి పైగా సౌమ్యరావు జబర్దస్త్ షో చేసింది. అయితే ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. జబర్దస్త్ నుండి సౌమ్యరావు తప్పుకుంది. ఆమె స్థానంలో బిగ్ బాస్ ఫేమ్ సిరి హన్మంత్ వచ్చింది. అయితే జబర్దస్త్ మానేయడం వెనుక కారణాలు గతంలో సౌమ్యరావు వెల్లడించింది. కొందరికి తన యాంకరింగ్ నచ్చితే మరికొందరికి నచ్చలేదని ఆమె అన్నారు. నాకు తెలుగురాదు. తెలుగులో అందమైన అమ్మాయిలు ఉండగా ఈ కన్నడ అమ్మాయిని ఎందుకు తీసుకున్నారని విమర్శలు చేశారు. నాకు యాంకర్ గా కూడా అనుభవం లేదు. స్కిట్స్ లో జోక్స్ కూడా అర్థం అయ్యేవి కాదు. నా తెలుగు దరిద్రంగా ఉందని కొందరు అన్నారు. అలాగే నాకు డాన్స్ రాదు. అందుకు డాన్స్ క్లాసులకు కూడా వెళ్ళాను. నేను సన్నగా ఉంటాను. డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే ఇంకా సన్నగా అయిపోతున్నాను. అందుకే జబర్దస్త్ డైరెక్టర్ మీరు డాన్స్ ప్రాక్టీస్ చేయకండి. ఇంకా సన్నగా అయితే బాగుండరు. కొంచెం తిని వళ్ళు చేయండి. డాన్స్ ఏదోలా మేనేజ్ చేయండి. దాని కోసం కష్టపడద్దు అన్నారు. నేను పాత యాంకర్స్ మాదిరి ఎంటర్టైన్ చేయాలని చాలా ప్రయత్నం చేశాను... అని సౌమ్యరావు చెప్పుకొచ్చారు. కాగా సౌమ్యరావు తాజా ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు సంచలనం రేపుతోంది. అన్ని పరిశ్రమలలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది. నాకు ఆ సమస్య ఎదురైందని సౌమ్యరావు అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కన్నడ పరిశ్రమపై సౌమ్యరావు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కన్నడ పరిశ్రమ మీద నాకు అభిమానం లేదు. వాళ్ళు టాలెంట్ ఉన్నవాళ్లను ఎంకరేజ్ చేయరు. అందుకే కన్నడ పరిశ్రమ వెనకబడిపోయింది. భవిష్యత్తులో ఇంకా వెనకబడిపోతుంది.. అని సౌమ్యరావు అన్నారు.టాలీవుడ్ లో కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉంది. కానీ నాకు ఇక్కడ అలాంటి సమస్య ఎదురు కాలేదు. కన్నడలో మాత్రం కొందరు లైంగిక వేధింపులకు గురి చేశారు. నటులు కాదు కానీ... దర్శకులు, నిర్మాతలు కమిట్మెంట్ అడుగుతారు... అంటూ సౌమ్యరావు ఓపెన్ కామెంట్స్ చేసింది. తెలుగు ఇండస్ట్రీలో కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉన్నప్పటికీ నాకు అనుభవం కాలేదని ఆమె అన్నారు.
Latest News