by Suryaa Desk | Fri, Jan 03, 2025, 08:49 PM
బాలీవుడ్ నటుడు సోనూసూద్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తాజాగా ఆయన బాడీ గార్డ్‌ల గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికే బాడీగార్డులను హీరోలు ఏర్పాటు చేసుకుంటారని, ఎలాంటి హడావుడి లేకుండా వెళితే ఎవరూ పట్టించుకోరని అన్నారు. తనకు బాడీగార్డ్స్ ఉన్నారని, ప్రేక్షకులపై చేయి చేసుకోవద్దని ముందే చెబుతానని తెలిపారు. ప్రస్తుతం సోనూ నటిస్తున్న ‘ఫతేహ్’ మూవీ ఈనెల 10న విడుదల కానుంది.అనంతరం ఆయన ‘దబాంగ్ 2’ (Dabangg 2)లో నటించే అవకాశం వస్తే తాను రిజెక్ట్ చేశానని తెలిపారు. అందుకు కారణాలను వివరించారు. ‘‘సల్మాన్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన్ని మా కుటుంబ సభ్యుడిగా భావిస్తుంటా. కలిసి వర్క్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆయన హీరోగా నటించిన ‘దబాంగ్’లో చెడ్డి సింగ్ పాత్రలో నటించా. ప్రేక్షకులకు అది బాగానే నచ్చింది. ‘దబాంగ్ 2’ తెరకెక్కిస్తోన్న సమయంలో సల్మాన్, ఆయన సోదరుడు, చిత్ర నిర్మాత అర్బాజ్ ఖాన్ నన్ను సంప్రదించారు. సీక్వెల్‌లో కూడా చెడ్డి సింగ్ పాత్ర నన్నే చేయాలని అడిగారు. కథ విన్నాక నా రోల్ అంత ఆసక్తికరంగా అనిపించలేదు. అందుకే రిజెక్ట్ చేశా. ఎందుకు ఇలా చేశావని సల్మాన్ నన్ను అడిగారు. నా కారణాన్ని ధైర్యంగా చెప్పా. అయినా చేయమని అడిగారు. ఆసక్తి లేకుండా ఎలా నటిస్తానని అడిగా. వాళ్లు అర్థం చేసుకున్నారు’’ అని అన్నారు.సోనూసూద్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమే ‘ఫతేహ్’. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. జనవరి 10న విడుదల కానుంది.
Latest News