by Suryaa Desk | Tue, Dec 31, 2024, 01:57 PM
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కోలీవుడ్ నటుడు ధనుష్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ రాబోయే తెలుగు సినిమాకి 'కుబేర' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. కుబేర చిత్రంలో రష్మిక మందన్న మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రం పాత్ర పరిచయాలు మరియు గ్లింప్సె సంచలనం సృష్టిస్తూనే ఉంది. చివరి నిర్మాణ దశలో ఉన్న ఈ చిత్రం ఫిబ్రవరి 2025లో విడుదల కానుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా కోసం ధనుష్ ఒక పాట పాడాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇది పరిచయ పాట అని ఫిలిం సర్కిల్ లో లేటెస్ట్ టాక్. అయితే అధికారిక నిర్ధారణ మూవీ మేకర్స్ రావలిసిఉంది. ఈ చిత్రంలో నాగార్జున, జిమ్ సర్భ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం దేవి శ్రీ ప్రసాద్, కెమెరా హ్యాండిల్ నికేత్ బొమ్మి, ఎడిటింగ్ కార్తీక శ్రీనివాస్ అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి మరియు అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై సునీల్ నారంగ్ మరియు పుస్కుర్ రామ్ మోహన్ రావు భారీ బడ్జెట్‌తో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్‌డేట్‌ల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Latest News