by Suryaa Desk | Tue, Dec 31, 2024, 05:53 AM
బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా తిరిగి భారతీయ చిత్రాల్లో నటించనున్నారా? అంటే అవుననే అంటోంది బాలీవుడ్ మీడియా. ఎనిమిదేళ్ల క్రితం హాలీవుడ్‌కి వెళ్లిన ప్రియాంక ‘సిటాడెల్’, ‘ద మ్యాట్రిక్స్ రిసరెక్షన్స్’ వంటి వెబ్‌సిరీస్, సినిమాలతో పాపులర్ అయ్యారు. కాగా, బాలీవుడ్ డైరెక్టర్ ఫర్హాన్ అక్తర్ తెరకెక్కించనున్న ‘జీ లే జరా’ చిత్రంలో ప్రియాంక నటించనున్నారనే వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ వార్తలను ప్రియాంక గానీ, నిర్మాణ సంస్థ గానీ ధృవీకరించలేదు. దాంతో ఆమె రీ ఎంట్రీ ఇచ్చే సినిమా ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో మరో వార్త బాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. మహేశ్ బాబు హీరోగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించే ఎస్‌ఎస్‌ఎమ్‌బీ29 సినిమాలో ప్రియాంక ఛాన్స్ కొట్టేశారనే వార్తలు బాలీవుడ్ మీడియాలో వెలువడుతున్నాయి. దీంతో భారతీయ చిత్రాల్లోకి ప్రియాంక చోప్రా ఎంట్రీ ఇచ్చే మూవీ ఇదేనని ఆమె అభిమానులు చర్చించుకుంటున్నారు.
Latest News