by Suryaa Desk | Mon, Dec 30, 2024, 08:10 PM
యాదమ్మ రాజు.. ఈ పేరు వింటేనే చాలామందికి నవ్వు వస్తుంది. పేరు మాత్రమే కాదు కటౌట్ చూస్తే కూడా చాలామంది నవ్వుతారు.ఈయన తన కటౌట్, తన జోకులతో ఎంతోమందిని కడుపుబ్బా నవ్వించారు. అలా శ్రీముఖి, రవి కాంబినేషన్లో వచ్చిన ‘పటాస్’ షో ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యాదమ్మ రాజు ఆ తర్వాత జబర్దస్త్ లో కూడా హడావిడి చేశారు.చాలామంది ఇండస్ట్రీకి వచ్చే కమెడియన్ లు జబర్దస్త్ అలాగే పటాస్ షో ద్వారానే మంచి గుర్తింపు సంపాదించి, చివరికి ఇండస్ట్రీలో కూడా హీరోలుగా, డైరెక్టర్లుగా రాణించగలుగుతున్నారు. అంతేకాదు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కూడా మారుతున్నారు. అలా జబర్దస్త్, పటాస్ వంటి షోలు వీరందరికీ మంచి జీవితాన్ని ఇచ్చాయని చెప్పుకోవచ్చు.అయితే పటాస్, జబర్దస్త్ ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన యాదమ్మ రాజు పలు సినిమాల్లో కూడా కమెడియన్ గా అవకాశాలు అందుకుంటున్నారు. యాదమ్మ రాజు కేవలం కామెడీ షోల ద్వారా మాత్రమే కాకుండా తన ప్రేమ ద్వారా కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యారు. తన ప్రియురాలు స్టెల్లా(Stella) తో కలిసి ఈయన చేసే షార్ట్స్, రీల్స్ అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. ఎట్టకేలకు ఎనిమిది సంవత్సరాల ప్రేమను పెళ్లి బంధంగా మార్చుకొని, స్టెల్లా అలాగే యాదమ్మ రాజు ఇద్దరూ భార్యాభర్తలయ్యారు. అలా వీరు రెండు సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ఎందుకంటే యాదమ్మ రాజు హిందూ.. స్టెల్లా క్రిస్టియన్ కావడంతో రెండు సాంప్రదాయాల ప్రకారం వీరి పెళ్లి జరిగింది.
పెళ్లయిన రెండు సంవత్సరాలకు ఈ జంటకు పండంటి బిడ్డ పుట్టింది.అయితే తాజాగా తమ కూతురి పేరుని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు యాదమ్మ రాజు స్టెల్లా దంపతులు. ఈ మేరకు తమ కూతురికి చాలా డిఫరెంట్ గా పేరు పెట్టడంతో చాలామంది ఈ పేరు చూసి షాక్ అవుతున్నారు.మరి ఇంతకీ యాదమ్మ రాజు, స్టెల్లా ఇద్దరు తమకి పుట్టిన పాపకి పెట్టిన ఆ పేరు ఏంటో ఇప్పుడు చూద్దాం.. సెలబ్రిటీల పిల్లల పేర్లు చాలా వింతగా డిఫరెంట్ గా ఉంటాయి. అలా యాదమ్మ రాజు కూడా తన కూతురికి ఒక డిఫరెంట్ పేరు పెట్టారు. అదేంటంటే ‘గిఫ్టీ’.. గిఫ్టీ ఏంటి ఈ పేరు వినడానికి భలేగా ఉందే అని అనుకుంటారు.
గిఫ్ట్ అంటే బహుమతి అనే సంగతి మనకు తెలిసిందే. ఇక ఆ దేవుడు ఇచ్చిన బిడ్డ కాబట్టి గిఫ్టీ అని నిక్ నేమ్ పెట్టుకున్నాం అంటూ తాజాగా స్టెల్లా, యాదమ్మ రాజు దంపతులు సోషల్ మీడియా ఖాతాలో ఈ విషయాన్ని షేర్ చేశారు. ఇక ఆ పోస్టులో ఏముందంటే.. “ఎనిమిదేళ్ల ప్రేమ ప్రయాణం రెండేళ్ల భార్యాభర్తల అనుబంధానికి గుర్తుగా మా కూతురు పుట్టింది. మేము ఫస్ట్ నుండి మాకు కూతురే పుట్టాలని కోరుకున్నాం. అలా ఫైనల్ గా మాకు మా కోరిక ప్రకారమే కూతురు పుట్టింది. నిన్న మొన్నటి వరకు మేము భార్యాభర్తలం మాత్రమే.కానీ ప్రస్తుతం తల్లిదండ్రులమయ్యాము. మేము దేవుణ్ణి కూతురు కావాలనే కోరుకున్నాం.ఆ దేవుడు మేము అనుకున్నట్లే మాకు కూతుర్ని పుట్టించాడు. అందుకే మాకు మా పాప దేవుడిచ్చిన బిడ్డ..కాబట్టి ఆమెకు గిఫ్టీ అని నిక్ నేమ్ పెట్టాము”.. అంటూ యాదమ్మ రాజు దంపతులు ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ విషయం తెలిసిన నెటిజన్స్ యాదమ్మ రాజు, స్టెల్లాలకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Latest News