by Suryaa Desk | Thu, Jan 02, 2025, 02:59 PM
మలయాళం స్టార్ ఉన్ని ముకుందన్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘మార్కో’. మలయాళంలో డిసెంబర్ 20న రిలీజయి మంచి విజయం సాధించి అనంతరం అన్ని భాషల్లో రిలీజవుతూ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తెలుగులో రేపు జనవరి 1న రిలీజ్ అవుతుండగా నేడు ప్రీమియర్స్ వేశారు. షరీఫ్ మొహమ్మద్ నిర్మాణంలో హనీఫ్ అదేని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. యుక్తి తరేజా, కబీర్ సింగ్, సిద్దిఖ్, జగదీశ్, ఇషాన్.. పలువురు మలయాళం స్టార్స్ ముఖ్య పాత్రల్లో నటించారు.
జార్జ్(సిద్దిఖ్), టోనీ(జగదీశ్)మరికొంతమంది గోల్డ్ స్మగ్లింగ్ నడిపించే గ్యాంగ్ స్టర్స్. జార్జ్ తమ్ముడు అంధుడు విక్టర్(ఇషాన్)ని, అతని ఫ్రెండ్ వసీంని కొంతమంది చంపేస్తారు. ఈ విషయం లండన్ లో ఉండే విక్టర్ అన్నమార్కో(ఉన్ని ముకుందన్)కి తెలిసి తన తమ్ముడ్ని చంపిన వాళ్ళను చంపడానికి ఇండియా వస్తాడు. అప్పటికే అతనికి మరియా(యుక్తి తరేజా)తో నిశ్చితార్థం అయి ఉంటుంది. మరి విక్టర్ ని చంపిన వాళ్ళు ఎవరు? వాళ్ళను మార్కో పట్టుకున్నాడా? మార్కో – మరియా ప్రేమ ఏమైంది? ఈ గ్యాంగ్ స్టర్స్ కథేంటి తెలియాలంటే తెరపై చూడాల్సిందే..
సినిమా విశ్లేషణ.. తమ్ముడిని చంపితే పగతీర్చుకోవడానికి అన్న రావడం అనే పాయింట్ తో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. ఈ సినిమా కథ కూడా సింపుల్ లైన్. ఫస్ట్ హాఫ్ లో తమ అక్రమ బిజినెస్ సీక్రెట్స్ తెలిశాయని వసీంని కొంతమంది చంపేస్తారు. వాళ్ళని వాసనతో అంధుడు విక్టర్ కనిపెట్టడంతో అతన్ని కూడా చంపేస్తారు. దీంతో అతని అన్నయ్యలు మార్కో, జార్జ్ తమ తమ్ముడిని పట్టుకునేవాళ్ళని వెతకడంతో సాగుతుంది. ఇక ఇంటర్వెల్ కి ఎవరు చంపారో హీరోకి తెలిసిపోతుంది. అయితే ఎవరు చంపారో ఆడియన్స్ కి ముందే తెలుస్తుంది కాబట్టి ఇంటర్వెల్ అంత ఇంపాక్ట్ అనిపించదు. సెకండ్ హాఫ్ హీరో వాళ్లపై ఎలా రివెంజ్ తీర్చుకున్నారు, వాళ్ళు హీరోని, అతని ఫ్యామిలీని ఏం చేసారు అని సాగుతుంది.
Latest News