by Suryaa Desk | Sun, Jan 05, 2025, 03:41 PM
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 10వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా రాజమహేంద్రవరంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా రామ్ చరణ్ తన బాబాయ్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ మొదటిసారి బాబాయ్ ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా ధవళేశ్వరం బ్రిడ్జిపై ర్యాలీ చేసినప్పుడు ఎంతమంది జనాలు అయితే వచ్చారో ఇప్పుడు కూడా ఇక్కడికి అంతేమంది తరలి వచ్చారని తెలిపారు. డైరెక్టర్ శంకర్ గారు ఈ సినిమాకు గేమ్ ఛేంజర్ అని టైటిల్ ఎందుకు పెట్టారో తెలియదు కానీ నిజజీవితంలో మాత్రం ఏపీలో కాకుండా ఇండియన్ పాలిటిక్స్ లోనే బాబాయ్ పవన్ కళ్యాణ్ రియల్ గేమ్ ఛేంజర్ అంటూ ఈ సందర్భంగా రామ్ చరణ్ చేసిన కామెంట్స్ సంచలనగా మారాయి. బాబాయ్ లాంటి ఒక గొప్ప వ్యక్తి పక్కన ఈరోజు ఇక్కడ నేను నిలబడినందుకు చాలా గర్వపడుతున్నాను. ఆయన కుటుంబంలో పుట్టినందుకు గర్వపడుతున్నాను.పవన్ కళ్యాణ్ గారిని చూసి శంకర్ గారు ఈ పాత్ర రాసుకున్నారు అంటూ చరణ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వేడుకలో బాబాయ్ అబ్బాయ్ ఇద్దరు కలిసి ఒకే వేదికపై కనిపించడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ఒక్కరే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు అనంతరం చిత్ర బృందం కూడా ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు.
Latest News