by Suryaa Desk | Mon, Jan 06, 2025, 04:01 PM
జర్నలిస్టుపై దాడి కేసు విషయంలో సుప్రీంకోర్టులో సినీ నటుడు మోహన్ బాబు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. విచారణ జరిపిన జస్టిస్ సుధాంశు దులియా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఈ తీర్పును వెల్లడించారు. సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి అందుబాటులో లేకపోవడంతో మోహన్ బాబు తరపు న్యాయవాది పాస్ ఓవర్ కోరారు. అందుకు న్యాయస్థానం అంగీకరించలేదు. వచ్చే గురువారం ఈ కేసు విచారణ చేస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది.
Latest News