by Suryaa Desk | Tue, Jan 07, 2025, 04:33 PM
సాధారణంగా హీరోలకు ప్రేక్షకులు అభిమానులుగా ఉంటారు. కానీ ఒక్క పవన్ కల్యాణ్ కు మాత్రమే ప్రేక్షకులతో పాటు సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులు కూడా అభిమానులుగా ఉంటారు.హీరోలు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు కూడా అభిమానులుగా ఉండేది ఎక్కువగా పవన్ కల్యాణ్ కే. ఈ విషయం గతంలో చాలా మంది సినీ సెలబ్రిటీలు చెప్పారు. ఇప్పుడు ఇండస్ట్రీకి పెద్ద ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు కూడా తన మనసులోని మాట చెప్పేశారు. సాధారణంగా అంత పెద్ద ప్రొడ్యూసర్ తాను పలానా హీరోకు అభిమానిని అని చెప్పుకోడు. ఎందుకంటే మిగతా హీరోలతో సినిమాలు చేయడంలో ఇబ్బంది అవుతుంది అనుకుంటారు.కానీ దిల్ రాజు మాత్రం తాను పవన్ కల్యాణ్ కు అభిమానిని అని కుండబద్దలు కొట్టినట్టే చెప్పారు. సంక్రాంతికి వస్తున్నాం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ ఆయన ఈ కామెంట్స్ చేశారు. తాను మొట్టమొదట సినిమా చూసింది వెకంటేశ్ దే అన్నారు. ఆ ఇండస్ట్రీలోకి రాకముందు వెంకటేశ్ కు అభిమానిగా ఉండేవాడినని.. ఇండస్ట్రీకి వచ్చాక పవన్ కల్యాణ్ కు అభిమానిగా మారిపోయానంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దాంతో పవన్ ఫ్యాన్స్ ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తున్నారు. మొన్న గేమ్ ఛేంజర్ ఈవెంట్ లో దిల్ రాజు పై పవన్ స్పెషల్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే కదా.వకీల్ సాబ్ సినిమాను దిల్ రాజు తీయడం వల్లే ఆ డబ్బులు జనసేన పార్టీని నడిపించడానికి ఇంధనంగా పనిచేశాయంటూ పవన్ చెప్పుకొచ్చారు. అందుకు రిప్లై లాగా ఇప్పుడు దిల్ రాజు ఈ వ్యాఖ్యలు చేశారు.
Latest News