by Suryaa Desk | Wed, Jan 08, 2025, 04:12 PM
విక్రాంత్ హీరోగా నటించిన సబర్మతి రిపోర్ట్ మూవీ ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది. గతేడాది విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. కాగా ఈ మూవీని ప్రధాని మోదీ, అమిత్ షా, ఇతర బీజేపీ సీనియర్ నాయకులు వీక్షించి ప్రశంసించారు. కొన్ని రాష్ట్రాల్లో పన్ను మినహాయింపు కూడా కల్పించారు. అయితే ఈ మూవీ జనవరి 10న జీ5లో స్ట్రీమింగ్ కానున్న చిత్ర యూనిట్ తెలిపింది. విక్రాంత్ ఇందులో జర్నలిస్ట్‌గా కనిపించనున్నారు.ది సబర్మతి రిపోర్ట్ గతేడాది నవంబర్ 15న థియేటర్లలో రిలీజైంది. సుమారు రూ.30 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.50 కోట్లు వసూలు చేసింది. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ కాకపోయినా.. పొలిటికల్ గా సంచలనం రేపిన మూవీగా నిలిచింది. ఈ సినిమా శుక్రవారం (జనవరి 10) నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
Latest News