by Suryaa Desk | Wed, Jan 08, 2025, 07:21 PM
శ్రీ రామ లక్ష్మణులపై తాను చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు బగ్గుమనడంతో యాంకర్ శ్రీముఖి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా క్షమాపణ చెప్పారు. ఇటీవల నిజామాబాద్‌లో జరిగిన 'సంక్రాంతికి వస్తున్నాం' ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి శ్రీముఖి హోస్ట్‌గా చేసింది. ఈ ఈవెంట్‌లో శ్రీముఖి.. నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్‌ల గురించి చెప్తూ.. 'రామలక్ష్మణ్ అనేది ఫిక్షనల్ క్యారెక్టర్స్. అప్పట్లోనే మనం విన్నాము. సాక్షాత్తు ఇప్పుడు దిల్‌రాజు, శిరీష్‌లాగా మన కళ్ళముందే కూర్చున్నారు' అని అన్నారు.
Latest News