by Suryaa Desk | Mon, Jan 06, 2025, 03:59 PM
హనీఫ్ అదేని దర్శకత్వం వహించిన ఉన్ని ముకుందన్ యొక్క 'మార్కో' బాక్స్ఆఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తుంది. ఈ చిత్రం జనవరి 1, 2025న తెలుగులో విడుదల అయ్యింది. ఈ యాక్షన్ డ్రామా తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వసూళ్లు చేసిన మలయాళ చిత్రంగా రికార్డు సృష్టించింది. మార్కో తెలుగు విడుదలను ఎన్‌విఆర్ సినిమా నిర్వహిస్తోంది. తాజాగా ఇప్పుడు ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా బాక్స్ఆఫీస్ వద్ద 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో సిద్దిక్, జగదీష్, అభిమన్యు ఎస్ తిలకన్, కబీర్ దుహన్ సింగ్, అన్సన్ పాల్ మరియు యుక్తి తరేజా వంటి ప్రతిభావంతులైన తారాగణం ఉంది. చంద్రు సెల్వరాజ్ సినిమాటోగ్రఫీ మరియు రవి బస్రూర్ ఇంటెన్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని పెంచాయి. షమీర్ మహమ్మద్ ఎడిటింగ్ వేగవంతమైన కథనాన్ని నిర్ధారిస్తుంది. షరీఫ్ మహమ్మద్ ఈ చిత్రాన్ని నిర్మించగా, రవి బస్రూర్ స్వరాలు సమకూర్చారు. క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఉన్ని ముకుందన్ ఫిలిమ్స్ ఈ సినిమాని నిర్మించాయి.
Latest News