by Suryaa Desk | Sun, Jan 05, 2025, 12:50 PM
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరోలు దర్శకులు చాలామంది ఉన్నారు. అయితే ప్రొడ్యూసర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న వాళ్లలో దిల్ రాజు ఒకరు.ఆయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధించాయి. ఇక ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే చాలు ఇప్పటికి చాలామంది అభిమానులు ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఇలాంటి సందర్భంలోనే దిల్ రాజు గేమ్ చేంజర్ సినిమాను దిల్ రాజు కు పవన్ స్వీట్ విన్నపం నిర్మిస్తున్న విషయం మనకు తెలిసిందే. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి శంకర్ డైరెక్షన్ చేస్తున్నాడు… ఇక ఈ సినిమా జనవరి 10వ తేదీన రిలీజ్ అవుతున్న నేపధ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రాజమండ్రిలో నిర్వహించారు. మరి ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా రావడం విశేషం…
ఇక పవన్ కళ్యాణ్ ఈ సినిమా యూనిట్ కి బెస్ట్ విషెస్ ను తెలియజేస్తూనే సినిమా ఇండస్ట్రీలో హీరోలు ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి. సినిమా ఇండస్ట్రీని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే ధోరణిలో మాట్లాడాడు. ఇక మొత్తానికైతే ఈ సినిమా ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు గురించి చాలా గొప్పగా మాట్లాడాడు. తన తొలిప్రేమ సినిమాకి మొదటగా డిస్ట్రిబ్యూటర్ గా ఇండస్ట్రీకి వచ్చిన దిల్ రాజు ఆ సినిమా సక్సెస్ అవ్వడంతో మరి కొన్ని సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించి ఆ తర్వాత ప్రొడ్యూసర్ గా మారారు.కాబట్టి ఆయన అంచెలంచెలుగా తఎదుగుతూ వచ్చాడు. తన లాంటి ప్రొడ్యూసర్ సినిమా ఇండస్ట్రీలో ఉండడం ఇండస్ట్రీ కి చాలా అవసరం అంటూ మాట్లాడాడు. అలాగే రీసెంట్ గా తెలంగాణ ప్రభుత్వం అతన్ని తెలుగు ఫిలిం డెవలప్మెంట్ ఛైర్మెన్ (టీ ఎఫ్ డి సి) గా నియమించిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ అతనికి కృతజ్ఞతలు తెలియజేస్తూనే తెలంగాణలో మాత్రమే కాదు. ఆంధ్రలో కూడా సినిమా ఇండస్ట్రి ని డెవలప్ చేసే పరిస్థితులను ఏర్పాటు చేయండి ఇటూ సైడ్ కూడా చాలా మంచి లోకేషన్స్ ఉన్నాయి.ఇక్కడికి వచ్చి షూటింగ్స్ చేసుకోండి దానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీకు పూర్తిగా సహకారం అందిస్తుంది. అలాగే వీలైతే ఇక్కడ స్టూడియోలను నిర్మించండి. సినిమాలకు సంభందించిన క్లాస్ లను ఏర్పాటుచేసి శిక్షణ పెట్టించండి. రాజమౌళి, త్రివిక్రమ్ లాంటి గొప్ప గొప్ప వాళ్ళ చేత డైరెక్షన్ ఎలా చేయాలి అనే దాని మీద ఇక్కడ వర్క్ షాప్స్ ని కండక్ట్ చేయించండి అంటూ పవన్ కళ్యాణ్ దిల్ రాజుకు చెబుతూ వచ్చాడు. ఇక తెలంగాణలో మాత్రమే కాదు ఆంధ్ర మీద కూడా కొంచెం ఫోకస్ చేయండి అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి…
Latest News