by Suryaa Desk | Tue, Jan 07, 2025, 01:53 PM
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ మూవీ గేమ్ ఛేంజర్. డైరెక్టర్ శంకర్ మొదటిసారి తెలుగులో రూపొందిస్తున్న ఈ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.తొలిసారిగా చరణ్ నటిస్తోన్న ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాపై భారీ హైప్ ఏర్పడింది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్, ఎస్ జే సూర్య కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే కొద్దిరోజులుగా ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొంటున్నారు రామ్ చరణ్. ఇటీవలే బాలకృష్ణ హోస్టింగ్ చేస్తున్న అన్‌స్టాపబుల్ టాక్ షోలో పాల్గొన్న చరణ్.. తన పర్సనల్ విషయాల గురించి చెప్పుకొచ్చారు. అలాగే ఇండస్ట్రీలోని నటీనటుల గురించి సైతం మాట్లాడారు.ఇదే షోలో చరణ్ తోపాటు తన స్నేహితులు శర్వానంద్, నిర్మాత విక్రమ్ వచ్చారు. అలాగే నిర్మాత దిల్ రాజ్ సైతం వచ్చారు. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ ప్రోమోను ఆహా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ షోలో బాలయ్య చరణ్ ను ఇరుకున పెట్టే ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. సమంత, కియారా అద్వానీ, అలియా భట్ లలో ఎవరు ఉత్తమ నటిగా ఎన్నుకుంటావ్ అని అడగ్గా.. ఉత్తమ నటిగా సమంతను ఎన్నుకున్నారట చరణ్. ఇక సమంత గురించి ఏం చెప్పారో తెలియాలంటే జనవరి 8న ఆహాలో ప్రసారమయ్యే అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ గురించి వెయిట్ చేయాల్సిందే.
అలాగే ఇదే షోలో తన కూతురు క్లింకారా గురించి మాట్లాడారు. అనంతరం ప్రభాస్ కాల్ చేయగా.. రామ్ చరణ్ ను సరదాగాఆడుకున్నారట డార్లింగ్. ఇక తమ స్నేహం గురించి మాట్లాడతూ.. చరణ్ గురించి పలు కీలక విషయాలను పంచుకున్నారట శర్వానంద్. ఈ ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.
Latest News