by Suryaa Desk | Mon, Jan 06, 2025, 04:35 PM
నూతన దర్శకుడు స్మరణ్ రెడ్డి దర్శకత్వం వహించిన "లవ్ రెడ్డి" అక్టోబరు 18న గ్రాండ్ గా థియేట్రికల్ విడుదల అయ్యింది. ఈ సినిమా వాస్తవ సంఘటనల ఆధారంగా ఆకర్షణీయమైన ప్రేమకథను అందిస్తుంది. ఈ చిత్రంలో అంజన్ రామచేంద్ర మరియు శ్రావణి రెడ్డి ప్రధాన పాత్రలు పోషించారు. సెహెరి స్టూడియో, ఎమ్‌జిఆర్ ఫిల్మ్స్ మరియు గీతాంశ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన "లవ్ రెడ్డి" ఆకట్టుకునే నిర్మాణ బృందంతో ఉంది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకోగా ఇటీవలే ప్రసారానికి అందుబాటులోకి వచ్చింది. తాజా ఇప్పుడు ఈ చిత్రం ప్రైమ్ వీడియోలో టాప్ ట్రేండింగ్ లో ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని స్ట్రీమింగ్ ప్లాట్ఫారం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని పంపిణీ చేస్తున్నారు. సునంద బి రెడ్డి, మదన్ గోపాల్ రెడ్డి, ప్రభంజన్ రెడ్డి, రవీంద్ర జి, హేమలత రెడ్డి, నవీన్ రెడ్డి, నాగరాజ్ బీరప్ప నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
Latest News