by Suryaa Desk | Mon, Jan 06, 2025, 03:01 PM
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గతేడాది చివర్లో కొరటాల శివ దర్శకత్వంలో చేసిన దేవర సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఎన్టీఆర్‌కు ఇది కెరీర్ పరంగా ఏడో వరుస హిట్. దేవరతో సాలిడ్ పాన్ ఇండియా హిట్ కొట్టిన ఎన్టీఆర్ లైనప్‌లో ఇప్పుడు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకటి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తోన్న సినిమా. దీనికి టైటిల్‌గా డ్రాగన్ ప్రచారంలో ఉంది. రుక్మిణి వసంత్ పేరు హీరోయిన్‌గా అనుకుంటున్నారు.
ఇక ఈ సినిమా కంటే ముందే ఎన్టీఆర్ బాలీవుడ్ష స్టార్ నటుడు హృతిక్ రోషన్‌తో కలిసి చేస్తోన్న మల్టీస్టారర్ సినిమా వార్ 2 కూడా సెట్స్ మీద ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈ యేడాది ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక డ్రాగన్ సెట్స్ మీదకు వెళ్లడమే ఆలస్యం.. కంటిన్యూగా షూటింగ్ పూర్తి చేసుకోనుంది. ఈ సినిమా రిలీజ్ డేట్‌పై అధికారిక అప్‌డేట్ రానప్పటకి వచ్చే సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.ఈ క్రమంలోనే ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా ఎలా ఉండబోతోందన్న ఉత్కంఠ అయితే ఇప్పుడు అందరిలోనూ ఉంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోతోన్న ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు ఏదో ఒక రూమర్ అయితే బాగా వినిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు