by Suryaa Desk | Mon, Jan 06, 2025, 11:17 AM
తన ఆత్మగౌరవం మీద జరిగిన దాడి అంటూ నటి మాధవీలత బోరున ఏడ్చేశారు. ‘నా పార్టీ (ప్రజల) కోసం, మహిళల కోసం, హిందూధర్మం కోసం మాత్రమే నిస్వార్థంగా నా వంతు నేను పోరాడుతున్నాను. రూపాయి తీసుకుంది లేదు. కానీ కక్ష గట్టి మాటలంటూ ఉన్నారు."చాలా ప్రయత్నం చేశా. కానీ నేనూ మనిషినే. నా ఆత్మ గౌరవం మీద జరిగిన దాడితో నాకున్న బాధను వర్ణించే పదాలు లేవు. ప్రతి క్షణం వేదనతో నిండి ఉంది. కోపం, నిరాశ, ఆవేదన , దుఃఖం... అన్నీ ఒకేసారి నన్ను కుదిపేస్తున్నాయి. కానీ, ఎన్నోసార్లు ఎందరో నా ఆత్మవిశ్వాసాన్ని చిదిమేయాలని ప్రయత్నం చేశారు. పదే పదే ఇవే మాటలన్నారు. ఎవరో వస్తారని ఎప్పుడూ ఆశపడలేదు. సమాజం కోసం నేను సైతం అనుకున్న. మగాడిలా పోరాడుతూనే ఉన్నాను. ఈ కష్టాలను అధిగమిస్తాను. నా ధైర్యాన్ని కోల్పోను. నాకు కుటుంబం, స్నేహితులు ఉన్న సరే నా అభిమానులు, సోషల్ మీడియాలో నన్ను ఫాలో అవుతున్న ఎందరో శ్రేయోభిలాషులు ఉన్నారు. నా బాధని మీతో పంచుకున్నందుకు క్షమించండి. మీ ప్రేమ అభిమానం, ఆశీర్వాదాలు నాకు శక్తిని ఇస్తాయి" అంటూ మాధవీలత వీడియో పోస్ట్ చేశారు.
Latest News