by Suryaa Desk | Tue, Jan 07, 2025, 12:17 PM
దివంగత నటి శ్రీదేవి కుమార్తెలు ఇండస్ట్రీలో బిజీ అవుతున్నారు. ఇప్పటికే పెద్ద కుమార్తె జాన్వీకపూర్ బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలు అందుకుంటున్నారు.తాజాగా ఖుషీ కపూర్ కూడా వరుస ఛాన్స్‌లతో బిజీ అవుతున్నారు. గతేడాది 'ది ఆర్చిస్'తో అలరించిన ఖుషీ మరికొన్ని రోజుల్లో 'లవ్యప్ప'తో పలకరించడానికి సిద్ధమవుతున్నారు. ఆమిర్‌ఖాన్ తనయుడు జువైద్ ఖాన్ హీరోగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకురానుంది. షూటింగ్ పూర్తయిన ఈ సినిమాను చూసినట్లు ఆమిర్ తెలిపారు.''నేను 'లవ్యప్ప' రఫ్ కట్ చూశాను. చాలా నచ్చింది. వినోదంతో పాటు సందేశాత్మక చిత్రంగా ఇది రూపొందింది. ఈ రోజుల్లో సెల్‌ఫోన్ కారణంగా మన జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయనేది ఇందులో చూపించారు. నటీనటులు వారి పాత్రలకు వందశాతం న్యాయం చేశారు. ముఖ్యంగా ఖుషీ అద్భుతంగా నటించింది. ఆమెను చూస్తున్నంతసేపు నాకు శ్రీదేవి గుర్తొచ్చింది. శ్రీదేవి తెరపై ఎంత ఉత్సాహంగా కనిపించేదో తెలిసిందే. అదే ఎనర్జీ ఖుషీలో కనిపించింది'' అని చెప్పారు.తమిళంలో విజయం సాధించిన 'లవ్‌టుడే'కు రీమేక్‌గా ఇది తెరకెక్కినట్లు సమాచారం. ప్రదీప్ రంగనాథన్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్టైంది. దీంతో ఈ చిత్రాన్ని హిందీలో తెరకెక్కించనున్నట్లు వార్తలు వచ్చాయి. 'లవ్యప్ప' (Loveyapa) చిత్రానికి ఆమిర్ నిర్మాతగానూ వ్యవహరించారు. 'ది ఆర్చిస్'లో తన నటనతో ఖుషీ అందరినీ ఆకర్షించారు. ఇప్పుడు మరోసారి బిగ్ స్క్రిన్‌పై కనిపించనున్నారు.
Latest News