by Suryaa Desk | Fri, Jan 10, 2025, 04:15 PM
గ్లామరస్ రోల్స్‌తోపాటు నటనకు ఆస్కారమున్న పాత్రలు చేస్తూ నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారే భామల్లో టాప్‌లో ఉంటుంది బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్. గతేడాది జిగ్రా సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ భామ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉంది. కాగా ప్రొఫెషనల్‌గా బిజీగా ఉండే ఈ బ్యూటీ షూటింగ్ పనుల నుంచి బ్రేక్ తీసుకుంది.ప్రస్తుతం వెకేషన్ టూర్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఈ భామ ఇంతకీ ఎక్కడికెళ్లిందో తెలుసా..? ప్రపంచ ప్రఖ్యాత టూరిజం స్పాట్స్‌లో ఒకటైన థాయ్‌లాండ్. బికినీలో థాయ్‌లాండ్ దీవుల్లోని సముద్రంలో జలకాలాడింది. సాగరతీరంలో విహరిస్తూ ప్రకృతిని అందాలను ఆస్వాదించింది. బ్లాక్ గాగుల్స్ పెట్టుకొని స్టైలిష్‌గా బోటు రైడ్ చేసింది. ఉదయాన్నే జిమ్ సెషన్‌కు వెళ్లింది. ఆ తర్వాత తనకిష్టమైన పుస్తకం చదివింది.అలియాభట్ థాయ్‌లాండ్ వెకేషన్‌లో సూపర్ ఛిల్ అవుట్ మూడ్‌లో ఉన్న ఫొటోలు ఇప్పుడు నెట్టింటిని షేక్ చేస్తున్నాయి. అలియాభట్ ప్రస్తుతం అల్ఫా, లవ్ అండ్ వార్ సినిమాల్లో నటిస్తుండగా.. చిత్రీకరణ దశలో ఉన్నాయి.