by Suryaa Desk | Thu, Jan 09, 2025, 06:58 PM
యాక్షన్ డ్రామా 'కూలీ' కోసం రజనీకాంత్ మరియు లోకేష్ కనగరాజ్ చేతులు కలిపారు. కూలీ అనేది స్వతంత్ర చిత్రం అని లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగం కాదని లోకేష్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఇప్పటికే 70% చిత్రీకరణ పూర్తయగా జనవరి రెండో వారంలో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. మొదట్లో మే 1న అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం రోజున కూలీని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేసారు. అయితే ఆ తేదీని ఇప్పుడు సూర్య మరియు కార్తీక్ సుబ్బరాజ్ రెట్రో తీసుకున్నారు. అలాగే కూలీ టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేయడానికి మరింత సమయం పడుతుంది. తాజా బజ్ ప్రకారం, ఈ సినిమాని మేకర్స్ ఆగస్ట్ 14ని విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఆగస్ట్ 14న కూలీ వస్తే స్వాతంత్య్ర దినోత్సవం హాలిడే అడ్వాంటేజ్‌ని తీసుకుంటుంది. సన్ పిక్చర్స్ నుంచి అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. కూలీలో అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, శృతి హాసన్, రెబా మోనికా జాన్, సత్యరాజ్ మరియు సౌబిన్ షాహిర్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శృతి హస్సన్ ఈ చిత్రంలో మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ అతిధి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణాన్ని కళానిధి మారన్ తన సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
Latest News