by Suryaa Desk | Thu, Jan 09, 2025, 04:25 PM
తెలుగులో సూపర్ క్రేజ్‌తోపాటు మంచి ఫ్యాన్ బేస్ ఉన్న భామల్లో టాప్‌లో ఉంటుంది బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ . ప్రభాస్‌తో కలిసి నటించిన సాహో చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పింది. శ్రద్ధాకపూర్ ఓ వైపు గ్లామరస్ రోల్స్ చేస్తూనే మరోవైపు నటనకు ఆస్కారమున్న పాత్రల్లో నటిస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తుంటుంది. గతేడాది స్త్రీ 2 సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ భామ నెట్టింట ఎంత చురుకుగా ఉంటుందో తెలిసిందే. తాజాగా శ్రద్ధాకపూర్ న్యూ హెయిర్ కట్ చేయించుకుంది.సెలూన్‌లో హెయిర్ స్టైల్ సెట్ చేయించుకున్న తర్వాత సెల్ఫీ దిగింది శ్రద్ధాకపూర్ . కొత్త సంవత్సరం.. కొత్త జుట్టు.. అంటూ న్యూ హెయిర్ స్టైల్‌కు క్యాప్షన్ ఇచ్చింది. ఇప్పుడీ స్టిల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇంతకీ శ్రద్ధాకపూర్ ఇలా కొత్త హెయిర్ స్టైల్ చేయించుకోవడం వెనుక సీక్రెట్ ఏమైనా ఉందా..? అంటూ తెగ చర్చించుకుంటున్నారు మూవీ లవర్స్. స్త్రీ 2 తర్వాత శ్రద్ధాకపూర్ నుంచి కొత్త సినిమా ప్రకటన రావాల్సి ఉంది.
Latest News