by Suryaa Desk | Thu, Jan 09, 2025, 08:39 PM
రకుల్ ప్రీత్ సింగ్ సూపర్ స్టన్నింగ్ ఫోటోషూట్ చేసి.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వింటర్లో కూడా తన లుక్స్‌తో ఇంటర్నెట్లో హీట్‌ని పెంచేస్తోంది ఈ భామ. పింక్ కలర్ లాంగ్ షర్ట్ వేసుకుని నేలపై కూర్చోని.. మెస్సీ హెయిర్ బన్‌తో ఫోటోషూట్ చేసింది రకుల్. గ్లోయింగ్ మేకప్ లుక్‌లో ఫ్లోర్‌పై కూర్చోని ఫోటోలకు హాట్ ఫోజులిచ్చింది. చేతులకు గోల్డెన్ బ్యాంగిల్స్ వేసుకుని.. మెడలో గోల్డెన్ చైన్స్ వేసుకుని తన లుక్‌ని పర్ఫెక్ట్గా మార్చుకుంది. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది హీరోయిన్. రకుల్ తెలుగులో మంచి హిట్స్ అందుకుంది. నటన, అభినయంతో అభిమానులను సంపాదించుకుంది. కన్నడ, తమిళ సినిమాల్లో కూడా నటించింది.హిందీలో కూడా సినిమాలు చేసి.. అక్కడ జాకీ భగ్నానీతో ప్రేమలో పడింది. అతనిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం తమిళ్, హిందీలో సినిమాలు చేస్తుంది రకుల్.