by Suryaa Desk | Thu, Jan 09, 2025, 04:09 PM
వరుస ఘన విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’ చిత్రంతో అలరించనున్నారు. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికలు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ‘డాకు మహారాజ్’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రచార కార్యక్రమాలలో మరింత జోరును పెంచింది చిత్ర బృందం. ఈ క్రమంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన కథానాయిక ప్రగ్యా జైస్వాల్, సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రగ్యా జైస్వాల్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. కంచె మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. 2021లో బాలయ్యతో అఖండ మూవీలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే జనవరి 12న ఆమె పుట్టినరోజు కాగా..అదే రోజు బాలయ్యతో కలిసి నటించిన ‘డాకు మహారాజ్’ విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్‌లో ప్రగ్యా మాట్లాడుతూ..‘ఈ మూవీలో నటించడం నా అదృష్టం, ఇదే నాకు బాలయ్య ఇచ్చే పెద్ద గిఫ్ట్’ అని తెలిపింది.
Latest News