by Suryaa Desk | Fri, Jan 10, 2025, 10:37 AM
అల్లరి నరేశ్ కథానాయకుడిగా సుబ్బు మంగదేవి దర్శకత్వంలో రూపొందిన మాస్ యాక్షన్ మూవీ ‘బచ్చలమల్లి’. అమృత అయ్యర్ కథానాయిక. క్రిస్మస్ కానుకగా డిసెంబరు 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం నెలరోజులు తిరక్కుండానే ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీ నుంచి తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో ‘బచ్చలమల్లి’ అందుబాటులోకి రానున్నట్లు ఓటీటీ వేదిక తెలిపింది. నరేశ్ మాస్ లుక్, నటన సినిమాకు హైలైట్‌గా నిలిచాయి.ఇంతకీ కథేంటంటే: బచ్చలమల్లి (అల్లరి నరేశ్) చిన్నప్పటి నుంచీ బాగా చురుకైనవాడు. తండ్రి గర్వపడేలా పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తాడు. తండ్రి అంటే ఎంతో మమకారం. కానీ, ఆయన తీసుకున్న ఓ నిర్ణయం మల్లి మనసుని గాయపరుస్తుంది. ప్రపంచం అంటే ఏమిటో తెలియని వయసులోనే తన మనసుకు తగిలిన ఆ గాయం చెడు అలవాట్లు, సావాసాలకి కారణం అవుతుంది. కాలేజీ చదువుకు కూడా స్వస్తి చెప్పి ట్రాక్టర్ నడుపుతుంటాడు. మద్యం తాగుతూ, నిత్యం ఊళ్లో ఏదో ఒక గొడవలో తలదూరుస్తూ మూర్ఖుడిలా మారతాడు. అప్పుడే అతని జీవితంలోకి కావేరి (అమృత అయ్యర్) వస్తుంది. ఆమెతో ప్రేమలో పడ్డాక మల్లి తీసుకున్న నిర్ణయాలేమిటి?మూర్ఖత్వం నుంచి బయటపడ్డాడా?లేదా? అసలు తండ్రితో ఉన్న సమస్యలేమిటి? కావేరితో ప్రేమకథ సుఖాంతమైందా? తదితర విషయాలు తెరపై చూడాలి.
Latest News