by Suryaa Desk | Fri, Jan 10, 2025, 02:54 PM
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా అలాగే శ్రద్దా శ్రీనాథ్, చాందిని చౌదరి కీలక పాత్రల్లో దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “డాకు మహారాజ్”. ఈ సంక్రాంతి కానుకగా రిలీజ్ కి వస్తున్న చిత్రాల్లో ఇదీ ఒకటి కాగా మంచి హైప్ ఈ సినిమా మీద నెలకొంది.అయితే ఈ సినిమా నుంచి ఆల్రెడీ ఓ ట్రైలర్ వచ్చి అలరించిన సంగతి తెలిసిందే. కానీ ఏపీలో లో భారీ లెవెల్లో ప్లాన్ చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అనూహ్యంగా రద్దయ్యింది. కానీ లేటెస్ట్ గా ఫ్యాన్స్ కి మరింత కిక్ ఇచ్చే విధంగా రెండో ట్రైలర్ ని మేకర్స్ ఇపుడు సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ జనవరి 10నే దీనిపై క్లారిటీ రానుంది అని తెలుస్తుంది.అలాగే నేడే ఈ రెండో ట్రైలర్ కూడా వస్తుందని టాక్. ఇక అంతే కాకుండా ఈ ట్రైలర్ సాలిడ్ యాక్షన్ ఎలిమెంట్స్ ఇంకా బాలయ్యపై పవర్ఫుల్ డైలాగ్స్ తో ఉంటుంది అని తెలుస్తుంది. మరి ఈ ట్రైలర్ వచ్చాక ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్ అలాగే ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహించారు. అలాగే ఈ జనవరి 12న రిలీజ్ కి వస్తుంది.
Latest News