by Suryaa Desk | Fri, Jan 10, 2025, 02:32 PM
హీరో సిద్దార్థ్, అషికా రంగనాథ్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘మిస్ యూ‘. ఈ మూవీని రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఎన్. రాజశేఖర్ తెరకెక్కించారు. ఈ మూవీ డిసెంబర్‌లో విడుదల కాగా ఆశించినంత విజయం సాధించలేకపోయింది. దీంతో చిత్ర యూనిట్ సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇది తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.సిద్దార్థ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ మిస్ యూ. గతేడాది డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ అందుకుంది. తెలుగు, తమిళ భాషల్లో రిలీజైన మిస్ యు ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా మిస్ యు మూవీని ఓటీటీలో రిలీజ్ చేశారు. జనవరి 10 నుంచి మిస్ యు.. అమెజాన్ ప్రైమ్‌లో తమిళ, తెలుగు భాషల్లో ప్రసారమవుతోంది. రాజశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సిద్దార్థ్, ఆషిక రంగనాథ్ జంటగా నటించారు. శామ్యూల్ మాథ్యూస్ నిర్మించారు. గిబ్రాన్ సంగీతం అందించారు.
Latest News