by Suryaa Desk | Sat, Dec 21, 2024, 12:53 PM
నాగ చైతన్య-సమంత విడిపోయి మూడేళ్లు అవుతుంది. ఇటీవల నాగ చైతన్య రెండో వివాహం కూడా చేసుకున్నాడు. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ఆయన ఏడడుగులు వేశారు. రెండేళ్లకు పైగా శోభితతో రిలేషన్ ఉన్న నాగ చైతన్య ఆమెను అర్ధాంగిగా తెచ్చుకున్నాడు. నాగ చైతన్య-సమంత విడిపోయి మూడేళ్లు అవుతుంది. ఇటీవల నాగ చైతన్య రెండో వివాహం కూడా చేసుకున్నాడు. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ఆయన ఏడడుగులు వేశారు. రెండేళ్లకు పైగా శోభితతో రిలేషన్ ఉన్న నాగ చైతన్య ఆమెను అర్ధాంగిగా తెచ్చుకున్నాడు. నాగ చైతన్యకు వివాహమైనప్పటికీ ఏదో ఒక విధంగా సమంతతో ఆయన రిలేషన్, లవ్, మ్యారేజ్, వివాదాలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఇంట్లో తనతో నాగ చైతన్య ఎలా ఉండేవాడో ఒక సందర్భంలో సమంత వెల్లడించారు. చెప్పాలంటే నాగ చైతన్యకు మించిన స్టార్డం సమంత సొంతం. వివాహం కాక ముందే సమంత సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్స్ లో ఉన్నారు. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఫేమ్ కలిగి ఉంది. టాప్ స్టార్స్ అందరితో సమంత జతకట్టింది. సమంతకు హిట్ పెర్సెంటేజ్ ఎక్కువ. ఆమెను లక్కీ చార్మ్ గా దర్శక నిర్మాతలు భావించేవారు. నాగ చైతన్యతో పాటు ఎన్టీఆర్ తో సమంత అధిక సినిమాల్లో నటించింది. వివాహం అనంతరం కూడా సమంత సినిమాల్లో నటించారు. బోల్డ్ రోల్స్ కూడా చేయడం విశేషం. ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ అనంతరం సమంత బాలీవుడ్ లో కూడా పాపులారిటీ రాబట్టింది. షూటింగ్స్ నుండి ఇంటికి వచ్చిన సమంతతో నాగ చైతన్య ప్రవర్తన ఈ విధంగా ఉండేదట. సమంత మాట్లాడుతూ.. ''నువ్వు బయట స్టార్. కానీ ఇంట్లో నువ్వు సాధారణ గృహిణి మాత్రమే. ఇంట్లోకి, వంటకు కావలసిన వస్తువులు ఉన్నాయా లేవా? అనేది చూసుకోవాలి. అలాగే వీకెండ్స్ ప్లాన్ చేయాలి అనేవాడు'' అని అన్నారు. సమంత మాటలు వింటే నాగ చైతన్య ఒకింత ఆమె మీద ఆధిపత్యం ప్రదర్శించేవాడేమో అనిపిస్తుంది. అయితే నాగ చైతన్య మీద సమంత ఆరోపణలు చేయలేదు. నవ్వుతూ... ఇంట్లో వారిద్దరి మాటలు, చేతలు ఎలా ఉంటాయో వెల్లడించింది. విడాకులు తీసుకున్న సమంత ఒంటరిగా ఉంటున్నారు. ఆమెపై ఇటీవల ఎఫైర్ రూమర్స్ వచ్చాయి. ది ఫ్యామిలీ మ్యాన్ 2 ఫేమ్ రాజ్ ని ఆమె ప్రేమిస్తున్నారంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలపై సమంత స్పందించలేదు. కాగా సమంత ట్రాలాల మూవింగ్ పిక్టర్స్ పేరుతో ఒక బ్యానర్ ఏర్పాటు చేసింది. మా ఇంటి బంగారు టైటిల్ తో ఒక ప్రాజెక్ట్ ప్రకటించింది. దీనిపై మరొక అప్డేట్ లేదు. సమంత నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ సిటాడెల్ ప్రస్తుతం అమెజాన్ ప్రైజ్ లో స్ట్రీమ్ అవుతుంది. వరుణ్ ధావన్ మరో ప్రధాన పాత్ర చేశాడు.
Latest News